కార్మికులు ఉద్యమానికి సిద్ధం కావాలి: రామకృష్ణ

GNTR: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ గురువారం మేడే సందర్భంగా కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ఎర్రజెండా నడకలో ఎన్నో త్యాగాలతో కార్మికులు సాధించుకున్న హక్కులు నేటి పాలకుల అనాలోచిత విధానాలతో ముప్పుతీరంలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో కార్మికులు, ఉద్యోగులు తమ హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.