అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన లారీ

NGKL: కల్వకుర్తి పట్టణ సమీపంలోని బీఈడీ కళాశాల ఎదుట లారీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన సంఘటన మంగళవారం తెల్లవారుజామున జరిగింది. మహబూబ్ నగర్ నుంచి కల్వకుర్తికి వస్తున్న లారీ డివైడర్‌ను ఢీకొట్టడంతో అది పూర్తిగా ధ్వంసం అయింది. డ్రైవర్ నిద్ర మత్తు వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.