RTC బస్సును ఢీకొన్న లారీ.. 10 మందికిగాయాలు

RTC బస్సును ఢీకొన్న లారీ.. 10 మందికిగాయాలు

KMM: ఆర్టీసీ బస్సును లారీ ఢీకొని పది మందికి గాయాలైన ఘటన వైరా మండలంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మణుగూరు డిపోకు చెందిన బస్సు ఖమ్మం నుంచి మణుగూరు వెళ్తుండగా వైరా మండలంలోని మధిర క్రాస్ రోడ్డు వద్ద వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పదిమందికి గాయాలు కావడంతో వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు.