సీఎం మార్పుపై డిప్యూటీ సీఎం స్పష్టత
కర్ణాటక సీఎం మార్పుపై DY CM డీకే శివకుమార్ క్లారిటీ ఇచ్చారు. సీఎంగా సిద్ధరామయ్యే కొనసాగుతారని.. తామంతా ఆయనతో కలిసి పని చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతో MLAల సమావేశం గురించి డీకేను ప్రశ్నించగా.. వాళ్లు PCC అధ్యక్ష పదవితో పాటు నాలుగైదు DY CM పదవుల కోసం కలిసినట్లు చెప్పారు. ఇలాంటి భేటీలు రెండున్నరేళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయన్నారు.