చెత్తపైన పన్ను వేసిన పాలన జగన్‌ది: నిమ్మల
AP: పట్టణ ప్రాంతాల్లో 80 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను మాజీ సీఎం జగన్ వారసత్వంగా ఇచ్చారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పాలకొల్లు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన మాట్లాడారు. ఇతర పన్నులతోపాటు చెత్తపైనా పన్ను వేసిన పాలన జగన్‌దేనని పేర్కొన్నారు. ఐదేళ్ల పాలనలో మున్సిపాలిటీల ఆదాయాన్ని కూడా పక్కదోవ పట్టించారని అన్నారు.