ఊటుకూరులో యూరియా కార్డులు పంపిణీ
NLR: విడవలూరు మండలంలోని ఊటుకూరు గ్రామంలో బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ యూరియా కార్డులు పంపిణీ చేశారు. రైతులకు వరిలో ఎరువుల యాజమాన్యం గురించి వివరించారు. ఎకరాకి దుక్కిలో ఒక DAP బస్తా లేక మూడు SSP బస్తాలు, కొద్దిపాటిగా 15 నుంచి 20 కేజీల వరకు పొటాష్ వేసుకోవాలని సూచించారు.