సీనియర్ జర్నలిస్టు మృతి

సీనియర్ జర్నలిస్టు మృతి

NZB: నగరానికి చెందిన సీనియర్ జర్నలిస్టు విజయ్ గుండెపోటుతో శుక్రవారం మృతి చెందాడు. గురువారం ఆయనకు గుండెపోటు రావడంతో నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించగా మరోసారి గుండెపోటు రావడంతో మృతి చెందాడు. జర్నలిస్ట్ విజయ్ మృతి పట్ల జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల నాయకులు నివాళులు అర్పించారు.