పాటి చౌరస్తా వద్ద ఎండు గంజాయి స్వాధీనం

పాటి చౌరస్తా వద్ద ఎండు గంజాయి స్వాధీనం

SRD: ఎస్-న్యాబ్, బీడీఎల్- భానూర్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో భాగంగా పటాన్ చెరు మండలం పాటి చౌరస్తా వద్ద ఓ వాహనంలో తరలిస్తున్న 128 కిలోల నిషేధిత ఎండు గంజాయిని పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ 64 లక్షల రూపాయలు విలువ ఉంటుందని సీఐ విజయ్ కృష్ణ తెలిపారు. నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించినట్లు పేర్కొన్నారు.