VIDEO: విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించిన ఎంఈవో
WGL: రాయపర్తి మండలం కొత్తూరులోని ప్రాథమిక, సెకండరీ పాఠశాలలను మంగళవారం ఎంఈవో వెన్నంపల్లి శ్రీనివాస్ ఆకస్మికంగా సందర్శించారు. ఆయన విద్యార్థుల సామర్థ్యాలు, ఉపాధ్యాయుల బోధన పద్ధతులు, హాజరు, సమయపాలన, మధ్యాహ్న భోజనం నిర్వహణను పరిశీలించారు. హెచ్ఎం రాజేంద్రప్రసాద్, సీఆర్పీ సీనపల్లి రాజు కూడా సమీక్షలో పాల్గొన్నారు.