మాగేచెరువులో గ్రామసభ అభివృద్ధి చర్చలు
SS: సోమందేపల్లి మండలం మాగేచెరువు గ్రామంలో కొత్త సచివాలయంలో గురువారం గ్రామసభ జరిగింది. గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల అర్పించారు. సర్పంచ్ నరసింహులు ఆధ్వర్యంలో పంచాయతీ అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై చర్చించారు. మండల సింగల్ విండో అధ్యక్షులు పూల వెంకటేశులు, సాగునీటి సంఘం అధ్యక్షుడు ఎం. తిమ్మయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.