VIDEO: మామిడితోటలో ఏనుగుల గుంపు

VIDEO: మామిడితోటలో ఏనుగుల గుంపు

CTR: పులిచెర్ల (M) దేవలంపేటపాలెం పంచాయతీ సరిహద్దులోని మామిడి తోటలో బుధవారం ఉదయం 16 ఏనుగులు మాటువేశాయి. అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఏనుగులు రాత్రంతా పంటలను ధ్వంసం చేశాయి. ఉదయం అడవుల్లోకి వెళ్లాల్సిన ఏనుగులు తోటలోనే తిష్ఠవేయడంతో రైతులు ఆందోళన చెందారు. అటవీశాఖ అధికారులు, సిబ్బంది ఏనుగుల కదలికలను సమీక్షిస్తున్నారు.