ఒంగోలు- తెనాలి ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీసులు ప్రారంభం
BPT: కలెక్టర్ ఆదేశాల మేరకు ఒంగోలు-తెనాలి మధ్య కొత్తగా రెండు ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీసులు బుధవారం ప్రారంభించినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి సీహెచ్ విమల తెలిపారు. ఆమె మాట్లాడుతూ తెనాలి బస్టాండ్ నుంచి ప్రతి రోజూ ఉదయం ఆరు, మధ్యాహ్నం రెండు గంటలకు వయా బాపట్ల, సాయంత్రం ఆరు గంటలకు వయా చీరాల, బాపట్ల మీదుగా తెనాలికి రెండు సర్వీసులు నడుస్తాయని ఆమె పేర్కొన్నారు.