మెప్మా విభాగం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ
JGL: మెట్‌పల్లి మున్సిపల్ మెప్మా విభాగం సిబ్బంది మరియు ఆర్పీలు మజ్జిగ పంపిణీ సేవా కార్యక్రమంలో శుక్రవారం పాల్గొన్నారు. మాల విరమణకు వచ్చే దీక్ష స్వాములకు, ప్రజలకు ఎండల తీవ్రత దృష్ట్యా ఇబ్బందులు కలగకుండా, పై అధికారుల ఆదేశాల మేరకు భీమా విభాగంలోని ఆర్పీలను కొండగట్టు పుణ్యక్షేత్రంలో వివిధ సేవా కార్యక్రమాలకు వినియోగించారు. ఈ కార్యక్రమంలో మెప్మా ఈవో శ్రీనివాస్, పాల్గొన్నారు.