'వికలాంగుల పెన్షన్ పెంచాలి'

SRCL: వికలాంగులకు పెన్షన్ పెంచాలని మండల వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు సోమవారం తాహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వికలాంగుల పింఛను రూ. 6000, వృద్దులు వితంతువులు ఒంటరి మహిళలు నేత, గీత, బీడీ కార్మికులతో పాటు ఇతర పెన్షన్ దారులకు రూ. 4000 పెన్షన్ పెంచాలన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్ మంజూరు చేయాలన్నారు.