18 నుండి వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

KNR: కొత్తపల్లి మండలం బద్దిపల్లి గ్రామంలోని శ్రీ అలివేలు మంగ, పద్మావతి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి వార్షికబ్రహ్మోత్సవాలు ఈనెల 18 నుండి జరుగుతాయని ఆలయ కమిటీ చైర్మన్ ఉప్పు తిరుపతి తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 19న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.ఈ మేరకు ఆదివారం కరపత్రలను ఆవిష్కరించారు