కమిషన్ సిఫారసులపై SGTU నిరసన

కమిషన్ సిఫారసులపై SGTU నిరసన

GDWL: విద్యా కమిషన్ సిఫారసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని SGTU ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. కమిషన్ తన పరిధిని దాటి సూచనలు చేయడం అభ్యంతరకరమన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో ఆకునూరి విద్యా కమిషన్ పత్రాలను దహనం చేసి నిరసన తెలిపారు. వేతనాలు ద్రవ్యోల్బణం ఆధారంగా నిర్ణయిస్తారని, ప్రవేశ విధానాలపై కమిషన్ జోక్యం తగదని పేర్కొన్నారు.