పార్టీ శ్రేణులతో హరీష్ రావు సమీక్ష
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగరవేసి విజయఢంకా మోగించాలని బీఆర్ఎస్ నేతలు అన్నారు. రహమత్ నగర్ డివిజన్‌లో మాజీ మంత్రి హరీష్ రావు పార్టీ శ్రేణులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రచార కార్యక్రమాల తీరు, ఓటర్ల అభిప్రాయాలు, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలో ఉన్న వ్యతిరేకత వంటి అంశాలపై చర్చించారు. రహమత్ నగర్‌లో బీఆర్ఎస్‌కి భారీ మెజారిటీ వస్తుందన్నారు.