హెడ్ ధాటికి 123 ఏళ్లనాటి రికార్డ్ బ్రేక్
ENGపై తొలి టెస్టులో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన AUS ప్లేయర్ ట్రావిస్ హెడ్ అరుదైన ఘనత సాధించాడు. 69 బంతుల్లోనే శతకం పూర్తిచేసి.. యాషెస్‌లో 2వ వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు. దీంతో 123 ఏళ్ల నాటి గిల్బర్ జేసప్(ENG - 1902లో 76 బాల్స్) రికార్డ్ బ్రేక్ అయింది. ఓవరాల్‌గా యాషెస్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్ ఆసీస్ దిగ్గజం గిల్‌క్రిస్ట్(57 బాల్స్) పేరిట ఉంది.