VIDEO: శివాలయాలకు పోటెత్తిన భక్తులు

VIDEO: శివాలయాలకు పోటెత్తిన భక్తులు

SKLM: కార్తీక మాసం రెండవ సోమవారం ఆమదాలవలస పట్టణం, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పలు శివాలయాల్లో పూజలు ఘనంగా జరుగుతున్నాయి. వేకువ జాము నుంచి ఆలయ అర్చకులు స్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ఆలయాలు ఆవరణలో దీపాలు వెలిగించి, స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు.