ఇద్దరు గంజాయి విక్రేతలు అరెస్ట్

ADB: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు. భైంసాలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భైంసాలోని గాంధీ గంజ్ వద్ద ఇద్దరు వ్యక్తులు గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో తనిఖీలు నిర్వహించి వారిని అదుపులోకి తీసుకొని 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరు పలు గంజాయి కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చారన్నారు.