VIDEO: సబ్ ట్రెజరీ కార్యాలయంలో తప్పిన ప్రమాదం
KRNL: ఎమ్మిగనూరులోని సబ్ ట్రెజరీ కార్యాలయం నిత్యం ఉద్యోగులు, ప్రజలతో కిటకిటలాడుతూ ఉంటుంది. బుధవారం కార్యాలయంలో ఒక్కసారిగా పైకప్పు ఊడి కిందపడటంతో అధికారులు, స్థానికులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. భవనం శిథిలావస్థకు చేరడంతో ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం కొత్త బిల్డింగ్ నిర్మించాలని కార్యాలయ సిబ్బంది డిమాండ్ చేశారు.