ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

MHBD: జిల్లా కేంద్రంలోని బెతోలు గ్రామ శివారులోని ముడుగుడిసెల తండ మలుపు వద్ద సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం, ఓ కారు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్ పై ఉన్న తాపీ మేస్త్రి జానీ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆయనను ఆంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు.