జాబ్ మేళాలో 13 మంది అభ్యర్థుల ఎంపిక

జాబ్ మేళాలో 13 మంది అభ్యర్థుల ఎంపిక

కోనసీమ: రామచంద్రపురం పట్టణం ఉపాధి కార్యాలయంలో నిర్వహించిన జాబ్ మేళాలో 13 మంది ఎంపికయ్యారు. మంత్రి వాసంశెట్టి సుభాశ్ ఆధ్వర్యంలో అపోలో ఫార్మసీ, అపోలో హెల్త్ కేర్ ఈ జాబ్ మేళా నిర్వహించింది. ఈ సందర్బంగా సోమవారం సాయంత్రం కంపెనీ ప్రతినిధులు వారికి నియామక పత్రాలు అందజేశారు. కంపెనీ హెచ్.ఆర్. రాజేశ్, ఉపాధి ప్రాజెక్ట్ డైరెక్టర్ రామ్ కుమార్ పాల్గొన్నారు.