'పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుంది'
MNCL: పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని కాంగ్రెస్ పార్టీ లక్షెట్టిపేట పట్టణ నాయకులు అన్నారు. లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డులో ఉన్న ఇందిరమ్మ లబ్ధిదారులకు శనివారం వారు ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.