'రాష్ట్ర ప్రజలు అభిమానించే నాయకుడు రేవంత్ రెడ్డి'
BDK: భద్రాచలం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకను ఇవాళ ఘనంగా నిర్వహించారు. కాగా, ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు పాల్గొని కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు అభిమానించే నాయకుడు, దేశంలో ఎక్కడలేని విధంగా రాష్ట్ర ప్రజానీకానికి సన్న బియ్యం ఇచ్చిన ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డి అని కొనియాడారు.