పాఠశాల ప్రహారి గోడను ప్రారంభించిన మంత్రులు

పాఠశాల ప్రహారి గోడను ప్రారంభించిన మంత్రులు

VZM: పూసపాటిరేగ మండలంలో మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం పర్యటించారు. ఓ పరిశ్రమ సహకారంతో నడిపల్లి గ్రామంలో నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను, ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన పాఠశాల ప్రహారి గోడను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లోకం మాధవి, కూటమి నేతలు పాల్గొన్నారు.