యారాడ బీచ్‌లో వ్యక్తిని కాపాడిన లైఫ్ గార్డులు

యారాడ బీచ్‌లో వ్యక్తిని కాపాడిన లైఫ్ గార్డులు

VSP: యారాడ బీచ్‌లో అలల తాకిడికి కొట్టుకుపోతున్న గరికన మహేశ్‌ను లైఫ్ గార్డులు సురక్షితంగా కాపాడారు. గంగవరం గ్రామానికి చెందిన మహేశ్ తన కుటుంబంతో కలిసి బీచ్‌కు వచ్చాడు. స్నానం చేస్తుండగా అలల ఉద్ధృతికి సముద్రంలోకి కొట్టుకుపోతుండగా, పోర్ట్ మెరైన్ సిబ్బంది వెంటనే అప్రమత్తం చేయడంతో లైఫ్ గార్డులు శ్రీను, లోవేష్ సహాయ చర్యలు చేపట్టి అతన్ని రక్షించారు.