ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి
GNTR: తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సోమవారం కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై మంత్రి సవితకు వివిధ సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. అందిన వినతులను మంత్రి సవిత పరిశీలించి, ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆమె పేర్కొన్నారు.