BREAKING: కూలిన భారత యుద్ధ విమానం
దుబాయ్ ఎయిర్ షోలో ప్రమాదం చోటుచేసుకుంది. ఎయిర్ షో కార్యక్రమంలో విన్యాసాలు చేస్తుండగా భారత్‌కు చెందిన తేజస్ యుద్ధ విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాద స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తుంది. విమానంలోని సిబ్బంది కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.