తిరువూరు బస్టాండ్‌లో సైకో హల్చల్
NTR: తిరువూరు బస్టాండ్ సెంటర్లో ఒక సైకో హల్చల్ సృష్టించాడు. అతను చాకు తీసుకుని ఆర్టీసీ డ్రైవర్లపై దాడి చేసేందుకు ప్రయత్నించడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రయాణికులు అతికష్టం మీద అతడిని బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సైకోను స్టేషను తరలించారు. 'నాకు అవకాశం ఇస్తే చంపుతా' అంటూ సైకో బిగ్గరగా అరవడం కలకలం రేపింది.