జిల్లాలో డ్రగ్స్ వాడవద్దంటూ భారీ ర్యాలీ
SRD: డ్రగ్స్ వినియోగం వద్దంటూ కెమిస్ట్ & డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ అతిథి గృహం నుంచి కొత్త బస్టాండ్ వరకు సాగిన ఈ ప్రదర్శనలో డ్రగ్స్ వ్యతిరేక ప్లకార్డులు ప్రదర్శించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోశ్ మాట్లాడుతూ, మత్తుకు బానిస కాకూడదని యువతకు పిలుపునిచ్చారు.