విద్యార్థుల ఆటో బోల్తా పలువురికి గాయాలు

విద్యార్థుల ఆటో బోల్తా పలువురికి గాయాలు

BDK: జూలూరుపాడు మండల కేంద్రంలోని ఓ జూనియర్ కళాశాల సమీపంలో శనివారం విద్యార్థుల ఆటో బోల్తా పడిన ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలవ్వగా స్థానికులు వెంటనే క్షతగాత్రులను జూలూరుపాడు పీహెచ్సీకి తరలించారు. మెరుగైన వైద్య సేవల కోసం ముగ్గురిని కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ప్రమాదంపై ఆరా తీశారు.