'తడి, పొడి చెత్తను వేరు చేసి సిబ్బందికి అందించాలి'
SDPT: పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా హుస్నాబాద్ పట్టణంలోని 17వ వార్డులో శుభ్రతపై మున్సిపల్ ఛైర్‌పర్సన్ లక్ష్మి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ బండికి అందించాలని వివరించారు. చెత్త వేర్పాటు వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని తెలిపారు.