VIDEO: ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన లారీ

ELR: జంగారెడ్డిగూడెం స్ధానిక బైనేరు వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తాడువాయు నుండి కొయ్యలగూడెం వైపు వెళుతున్న జామాయిల్ ట్రాక్టర్‌ను ట్యాంకర్ లారీ ఎదురుగా ఢీ కొట్టింది. ఎదురుగా వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టెక్ చేసే క్రమంలో ట్రాక్టర్‌ను ఢీ కొట్టినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనలో ట్రాక్టర్, ట్యాంకర్ డ్రైవర్లకి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.