ప్రజావాణికి 39 ఫిర్యాదులు

HYD: హైడ్రా కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా 39 ఫిర్యాదులు అందించినట్లు హైడ్రా అధికారులు తెలిపారు. ప్రజావాణిలో నాలాలు, చెరువుల కబ్జాలపై ఎక్కువగా ఫిర్యాదులు అందాయని, కాలనీలను, రహదారులను వరద ముంచెత్తడానికి కారణమవుతున్న కబ్జాలను వెంటనే తొలగించాలని ఫిర్యాదుల్లో పేర్కొన్నట్లు తెలిపారు.