'స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపిస్తే.. సీసీ కుంట రూపురేఖలు మారుస్తా'

MBNR: స్థానిక సంస్థల ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించినట్లైతే సీసీ కుంట రూపురేఖలు మారుస్తానని ఎంపీ డీకే అరుణ అన్నారు. శనివారం సీసీ కుంట మండల కేంద్రంలో రెండు కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అంతకు ముందు వాల్మీకి గంగాభవాని దేవాలయాలలో ఎంపీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.