VIDEO: నామినేషన్ కేంద్రాల వద్ద బారులు తీరిన అభ్యర్థులు

VIDEO: నామినేషన్ కేంద్రాల వద్ద బారులు తీరిన అభ్యర్థులు

ASF: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు శుక్రవారం చివరి రోజు కావడంతో తిర్యాణి మండలంలోని అన్ని కేంద్రాల వద్ద అభ్యర్ధులు బారులు తీరారు. భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇతరులు లోనికి వెళ్లకుండా వాహనాలు దూరంగా నిలిపివేస్తున్నారు.