రైతులు అధైర్య పడవద్దు: జడ్పీ మాజీ ఛైర్‌ పర్సన్

రైతులు అధైర్య పడవద్దు: జడ్పీ మాజీ ఛైర్‌ పర్సన్

GDWL: జిల్లాలో రైతులకు యూరియా కొరత లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్ సరిత అన్నారు. గురువారం ఆమె కలెక్టర్ సంతోష్‌ను కలెక్టర్ కార్యాలయంలో కలిసి రైతుల సమస్యలను వివరించారు. జిల్లాకు సరిపడా యూరియా కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే రైతులు ఎవరూ అధైర్యపడొద్దని, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవాలని పేర్కొన్నారు.