అభిషేక్ శర్మ బ్యాటింగ్‌కు ఫిదా: వాట్సన్

అభిషేక్ శర్మ బ్యాటింగ్‌కు ఫిదా: వాట్సన్

అభిషేక్ శర్మపై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్ వాట్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ శర్మ బ్యాటింగ్‌ తనను ఎంతగానో ఆకట్టుకుందని పేర్కొన్నాడు. అతను బౌలర్‌ను లెక్కచేయకుండా దూకుడుగా ఆడతాడని చెప్పాడు. అభిషేక్ క్రీజులో ఉంటే ఎంత గొప్ప బౌలర్‌కైనా తిప్పలు తప్పవని వ్యాఖ్యానించాడు. అందుకే అతడు T20ల్లో నెం.1 బ్యాటర్‌గా కొనసాగుతున్నాడని తెలిపాడు.