నేటి నుంచి ఇందిరమ్మ ఇళ్ల సర్వే

నేటి నుంచి ఇందిరమ్మ ఇళ్ల సర్వే

NZB: ఆర్మూర్‌లో ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న వారికి శనివారం నుంచి సర్వే ప్రారంభిస్తున్నట్లు పురకమిషనర్ రాజు తెలిపారు. అధికారులు ఇంటికి వచ్చినప్పుడు సంబంధిత పత్రాలు చూపించాలని, దరఖాస్తుదారుడు సైతం అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకొన్న వాళ్లకి మాత్రమే సర్వే ఉంటుందని, ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.