పాము కాటుతో వ్యక్తి మృతి

గుంటూరు: ఈపూరు మండలం బొగ్గరం గ్రామంలో పసుపులేటి ఏడుకొండలు(40) బుధవారం సాయంత్రం తన మాగాణి పొలంలో పని చేసుకుంటుండగా పాము కాటు వేయగా మృతి చెందాడు. మృతుని భార్య పసుపులేటి వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఫిరోజ్ తెలిపారు.