వెయ్యి లడ్డూలతో గణనాథునికి పూజలు

వెయ్యి లడ్డూలతో గణనాథునికి పూజలు

NDL: మహానంది మండలం ఆర్ఎస్ గాజులపల్లి గ్రామ సమీపంలోని మరకత లింగేశ్వరస్వామి, నవగ్రహ దేవాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని వెయ్యి లడ్డూలతో వినాయకునికి గరిక సహస్రనామార్చనలతో విశేషమైన పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.