ఆ గ్రామంలో రెండు రోజులుగా చిమ్మచీకట్లే

SKLM: మెలియాపుట్టి మండలం చోంపాపురంలో నేటి నుంచి గ్రామదేవత మహోత్సవాలు జరగనున్నాయి. దీంతో వివిధ ప్రాంతాల్లో వలస ఉన్న స్థానికులు గ్రామానికి చేరుకున్నారు. అయితే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా గత రెండు రోజులుగా గ్రామానికి విద్యుత్ సరఫరా లేదని, వేసవి కావడంతో చిన్నారులు, వృద్ధులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు వాపోయారు.