నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

NTR: సోమవారం విజయవాడ కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ డా.జి. లక్ష్మీశ ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించడం జరుగుతుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.