ఉద్యానవన పంటల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

ASR: అధిక సంఖ్యలో గిరిజన రైతులుండే జిల్లాలో ఉద్యానవన పంటల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. అమరావతిలో సీఎం చంద్రబాబు నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో మాట్లాడారు. పండ్ల తోటల పెంపకం ద్వారా గిరిజన రైతుల ఆదాయాన్ని పెంచాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. అందుకు 6,111ఎకరాల్లో ఉద్యానవన పంటల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు.