RAIN ALERT: స్కూళ్లకు సెలవు.. ఎక్కడంటే?

భారీ వర్షాలు కురుస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. APలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం.. TGలోని ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాల్లో సెలవు ఇచ్చారు. కామారెడ్డి జిల్లా మద్నూర్, డోంగ్లీ మండలాలకు కూడా సెలవు ప్రకటించారు. కాగా, వర్షాల నేపథ్యంలో అవసరమైతే స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని ఇరు రాష్ట్రాల CMలు ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.