VIDEO: పారిశుధ్య నిర్వహణ పనులను పర్యవేక్షించిన నెల్లూరు కమిషనర్
నెల్లూరు: నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక 39వ డివిజన్ మూలాపేట, రాజా రామ్ మోహన్ ప్రాంతాల్లో సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని సురక్షిత తాగునీటి సరఫరా నిర్వహణ తీరును కమిషనర్ పర్యవేక్షించారు. తాగునీటి సరఫరాపై స్థానిక ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు.