వలసదారులపై స్వీడన్ ప్రభుత్వం కఠిన చట్టం!
వలసదారులను నియంత్రించేందుకు, ఉన్నవారిని వెనక్కి పంపించేలా స్వీడన్ ప్రభుత్వం కఠిన చట్టాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఆ దేశ పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందితే ఈ జూలై 13 నుంచి చట్టం అమల్లోకి రానుంది. అప్పులు ఎగ్గొట్టడం, సంక్షేమ పథకాలను తప్పుదోవ పట్టించడం, నివాస అనుమతి కోసం ప్రభుత్వాన్ని మోసగించడం వంటివి చేస్తే నిజాయతీ లేని ప్రవర్తనగా పరిగణించనున్నారు.