ఆర్జీల పరిష్కారానికి సత్వర చర్యలు: ఎస్పీ
SKLM: ప్రజా అర్జీల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి అధికారులు ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా పిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ స్వయంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, సంబంధిత అధికారులతో వెంటనే ఫోన్ ద్వారా మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్నారు.