విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

NLR: సంగం మండలం పడమటిపాలెంలోని మహాలక్ష్మమ్మ ఆలయంలో ఆదివారం జరిగిన నూతన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామంలో నూతన విజయ గణపతి, నాగేంద్ర స్వామి, మహాలక్ష్మమ్మ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే స్వగ్రామం కావడంతో ఆయన విధిగా పాల్గొని పూజలు చేశారు.